కోనసీమలో ఏప్రిల్ 3 నుండి 9 వరకు పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం భాష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలను ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిచేశామన్నారు. సహకరించిన సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.