నిడదవోలు చర్చి పేటలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్‌షా అంటూ శనివారం రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు. కెవీపీఎస్ జిల్లా నాయకుడు జువ్వల రాంబాబు మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్‌షాను తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.