గొల్లప్రోలు: ఆరుగురిపై వరకట్న వేధింపుల కేసు

60చూసినవారు
గొల్లప్రోలు: ఆరుగురిపై వరకట్న వేధింపుల కేసు
గొల్లప్రోలు ఈబీసీకాలనీకి చెందిన కోలా సునీత ఫిర్యాదుతో ఆమె భర్త, మరో అయిదుగురిపై మంగళవారం వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడకు చెందిన ఆనందప్రసాద్ తో నాలుగేళ్లక్రితం సునీతకు వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వివాహ సమయంలో కట్నం, ఇతర లాంఛనాలుగా రూ. 4. 50 లక్షలిచ్చారని, కొంత కాలంగా సొమ్ము తెమ్మని భర్త వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్