ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం పట్టణ శివారు జగ్గయ్య చెరువు ప్రాంతంలో జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఉమ్మడి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరంను గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.