పిఠాపురం పట్టణంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పశువుల సంత ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. దీనిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం నిధులు మంజూరు చేసారు. శుక్రవారం పిఠాపురం జనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, జనసేన నాయకులు పశువుల సంత అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు.