కోనసీమ కొబ్బరి రైతుల్లో 'ధరహాసం'

69చూసినవారు
కోనసీమలో కొబ్బరి ధరలు గణనీయంగా పెరగడంతో రైతులు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. వరుస పండుగలతో కొబ్బరి కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి. మహాశివరాత్రి ముందు నుంచి ప్రారంభమైన ధర మధ్యలో వారం రోజులు ఒడిదుడుకులు ఎదుర్కొంది. మళ్లీ ఈ నెల 15 నుంచి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. 1,000 కొబ్బరి కాయలు రూ. 14,500 నుంచి రూ. 15 వేలు వరకు కొంటున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్