ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి జెకె గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగుల మహాసభ ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నూతన కార్యావర్గం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షునిగా పి. గిరిప్రసాద్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ఎస్ పాత్రను ఎంపికయ్యారు. నూతనంగా కార్యవర్గ సభ్యులను రాష్ట్ర మంత్రి కందుల దుర్గెశ్ అభినందించారు.