ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం రామచంద్రపురం, రాజోలు ఆలమూరు, తుని, ముమ్మిడివరం కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల మండలాలలో ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమండ్రి నుంచి ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ అదలాత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.