రాజమండ్రి: మహనీయుల ఆత్మ బలిదానం ఫలితమే బిజెపి పార్టీ

69చూసినవారు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి బిజెపి కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఆదివారం పార్టీ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ ఏప్రిల్ 6 1980లో స్థాపించబడిందని నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. ఎంతోమంది మహనీయుల ఆత్మ బలిదానం ఫలితమే బిజెపి పార్టీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్