వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని గచ్చిబౌలిలో తన నివాసంలో అరెస్ట్ చేయడం అత్యంత హేయమని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జనసేన నాయకుడు జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఉగ్రవాదుల అరెస్టు చేయడం అత్యంత దారుణమని మాజీమంత్రి శుక్రవారం రాజమండ్రిలో బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో అన్నారు.