శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈనెల 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి యడ్లపల్లి అయ్యప్ప తెలిపారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద వారు మాట్లాడారు. గత నాలుగేళ్లుగా శ్రీరామనవమి రోజు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని గుర్తు చేశారు. ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.