రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, తూ. గో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పాల్గొని మాట్లాడారు. కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని ప్రతీ గడపలో వెలుగులు నిండాలని కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.