నాటు సారా నిర్మూలనకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నవోదయం 2. 0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి సీ. హెచ్. లావణ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాటు సారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, దీనికి బానిసలు కాకుడదని విజ్ఞప్తి చేశారు. నాటు సారా తయారు చెయ్యడం, వినియోగించడం నేరం అన్నారు.