ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రథసారదులు కోసం, లోక కళ్యాణార్థం ముక్కోటి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు తెలిపారు.