అడ్డతీగల మండలంలోని బొడ్లంకలో ఆదివారం రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యదర్శి స్వప్నకుమారి కిషన్ మోర్చా మండల కార్యదర్శి శ్రావణ్ కుమార్ సర్పంచ్ రాఘవ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ. నూతన రామాలయం నిర్మాణం చేపట్టనుండడంతో గిరిజనుల మందిరం కష్టాలు తీరనుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాఘవ సత్యనారాయణ తదితరులున్నారు.