వై. రామవరం మండలంలోని పూతిగుంట గ్రామంలో మరమ్మతులకు గురైన వాటర్ ట్యాంకుకు బాగు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ మంచినీటి ట్యాంకు పగిలిపోవడంతో 50 గడపల గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని పూతిగుంట గిరిజనులు కోరుతున్నారు.