ముసురిమిల్లి కాలువతో చెరువులకు నీటి సరఫరా

57చూసినవారు
ముసురిమిల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా చెరువులకు సాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఫోక్స్ పేట నుంచి దేవీపట్నం వైపునకు ఆదివారం నీటి సరఫరా జరిగిందని స్థానిక రైతులు తెలిపారు. దీంతో గోకవరంలో పలు చెరువులకు సాగునీరు సరఫరా అవుతుందని రైతులు చెప్పారు. దేవారం, పోతవరం, శరభవరం గ్రామాల్లోని చెరువులకు సాగునీటి సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్