జికె. వీధి: రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి

55చూసినవారు
జికె. వీధి: రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి
గూడెంకొత్తవీధి మండలంలోని పెదవలసలో రైతులకు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంచాయితీ అగ్రికల్చర్ అధికారి రవి మాట్లాడుతూ రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. ప్రతి ఒక్క రైతు తమ భూములకు రిజిస్ట్రేషన్ తోపాటు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్