రాజవొమ్మంగి: కిల్కారి కాల్స్ పై అవగాహన

51చూసినవారు
రాజవొమ్మంగి మండలంలోని లాగరాయిలో ఆశా కార్యకర్త బుజ్జమ్మ గర్భిణీలు బాలింతలకు సోమవారం కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహార నియమాలు వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమతం చేసేందుకు కిల్కారి పేరిట ప్రభుత్వం ఆడియో విడుదల చేసిందన్నారు. ఈ సందేశాలు గర్భిణీలు పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. నివృత్తి చేసే విధంగా వాయిస్ సందేశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్