రంపచోడవరం: టీచర్ అవతారం ఎత్తిన ఎంపిటిసి

71చూసినవారు
రంపచోడవరం: టీచర్ అవతారం ఎత్తిన ఎంపిటిసి
రంపచోడవరం మండలంలోని తామరపల్లి గోపవరం ఎంపీపీ పాఠశాలను ముసిరిమిల్లి ఎంపిటిసి కుంజం వంశీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాసేపు స్కూల్ టీచర్గా మారిన ఆయన కొంతసేపు విద్యార్థులకు బోధించి ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారు చదువులు ఎలా సాగుతున్నాయో స్వయంగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని పాఠశాల హెడ్మాస్టర్ను సూచించారు.

సంబంధిత పోస్ట్