రంపచోడవరం: తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి

57చూసినవారు
రంపచోడవరం మండలంలోని రంపచోడవరం నుంచి రంప గ్రామానికి మధ్య తారురోడ్డుకి మరమ్మతులు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రంపచోడవరం నుంచి రంప గ్రామానికి మధ్య తారురోడ్డు శిథిలావస్థకు చేరి రహదారిపై కంకరరాళ్లు తేలి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాహనదారులు సోమవారం వాపోయారు. ఆర్అండ్బి అధికారులు స్పందించి ఈ తారురోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్