రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వైసీపీపై ఫైర్ అయ్యారు. మంగళవారం మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలన ఏజెన్సీలో ఒక్క గిరిజనుడికి ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు. గిరిజన చట్టాలపై వైసీపీ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. గిరిజన హక్కులు, చట్టాలకు ఎటువంటి భంగం కలగదని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు.