రాజవొమ్మంగి మండలంలోని శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకోంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నర్సీపట్నం నుంచి కాకినాడ వెళ్లే పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి మండలంలోని సూరంపాలెం వద్ద బస్సు ముందు చక్రాల రాడు విరిగిపోయి టైరు ఊడిపడింది. ఈ ప్రమాదంలో సుమారు బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.