ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. మామిడికుదురు నుంచి చలో గుంటూరు కార్యక్రమానికి తరలివెళ్తున్న మాల మహానాడు కార్యకర్తల ర్యాలీకి ఆయన ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు, మాల మహానాడు నాయకులు భూపతి వెంకటపతి, నల్లి శ్రీనివాస్, బొంతు మణిరాజు, కలిగితి పల్లంరాజు, నల్లి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.