గ్రామీణ ఉపాధి హామీలు నిధులతో గ్రామాల్లో పక్క సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మామిడికుదురులో శనివారం ఉపాధి నిధులు రూ. 29 లక్షలతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. పలు గ్రామాలకు లింకు రోడ్డుగా ఉపయోగపడే ఈ రహదారి ఎంతోకాలంగా అద్వానంగా ఉందన్నారు. ఎన్డీఏ హయాంలో రోడ్ అభివృద్ధికి నిధులు చెల్లించామన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.