అమలాపురంలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలు కోనసీమ జిల్లాలో రసవత్తరంగా జరుగుతున్నాయి. అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ పద్మరాజు, కార్యదర్శి వెంకన్న నాయుడు పోటీలను పర్యవేక్షిస్తున్నారు.