పేలుడు ఘటనలో 14కు చేరిన బాధితులు
అమలాపురంలో బాణాసంచా తయారు చేస్తుండగా జరిగిన పేలుడు ఘటనలో క్షతగాత్రుల సంఖ్య 14కు చేరినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బాధితులకు అమలాపురంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండంతస్తుల భవనంలో బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఓ భవనం కుప్పకూలగా, మరొక భవనం పాక్షికంగా దెబ్బతింది. ఎస్పీ, డీఎస్పీ, సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.