అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెనాయుడు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మంగళవారం నియమించింది. క్యాబినెట్ లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును ఈయన పర్యవేక్షిస్తారు.