కోడలిపై మామ అత్యాచారం
తనపై మామ అత్యాచారం చేశాడని రాజోలు మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజోలు ఎస్సై బి. రాజేష్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. ఆమె భర్త ఉపాధి కోసం ఏడాది క్రితం ఇతర దేశం వెళ్లాడన్నారు. గతంలో మామ ఒకసారి అత్యాచారం చేశాడని, ఇప్పుడు మళ్లీ వేధింపులకు గురిచేస్తున్నాడని, అతడి నుంచి రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు.