పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో ఆదివారం రాత్రి అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం రాష్ట్రస్థాయి స్త్రీ పురుషుల విభాగాలలో పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నేటి యువత క్రీడల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.