భీమవరం పట్టణంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు హాజరయ్యారు. అనంతరం వారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.