గుడివాడ: అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి
గుడివాడను అత్యుత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. రూ. 37. 40 లక్షల నిధులతో శుక్రవారం గుడివాడ పట్టణం బేతవోలులోని ముస్లిం స్మశాన వాటిక (కబ్రస్థాన్) అభివృద్ధి పనులకు కూటమి నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి ముస్లిం సాంప్రదాయం ప్రకారం శంకుస్థాపన చేశారు.