గుడివాడ - Gudivada

కృష్ణా జిల్లాలో మంత్రులు వీరేనా..?

కృష్ణా జిల్లాలో మంత్రులు వీరేనా..?

ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి గెలుపొందిన బొండా ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం)- నీటిపారుదల శాఖ, వెనిగండ్ల రాము (తెలుగు దేశం)- యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం, కొల్లు రవీంద్ర (తెలుగు దేశం) - బి.సి. సంక్షేమ శాఖ, చేనేత శాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.