పాలకొల్లులో ఈనెల 14న నీటి సంఘాల ఎన్నికలు

82చూసినవారు
పాలకొల్లు మండలంలో ఈనెల 14న నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ దుర్గా కిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అలాగే మండలంలోని పాలకొల్లు, దిగమర్రు, శివదేవుని చిక్కాల, వెలివల, లంకలకోడేరులో సంబంధిత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. కావున సంబంధిత రైతు ఓటర్లు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్