తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఎ.స్వరాజ్య లక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా పని చేసిన కళ్యాణ్ చక్రవర్తి బదిలీ కావడంతో ఆయన స్థానంలో స్వరాజ్య లక్ష్మి నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఎస్సైగా ఆమె పని చేశారు. ఆమెకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. తొలుత ఆమె ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.