తిరువూరులో విశ్రాంత అంగన్వాడీ టీచర్ కన్నుమూత
తిరువూరు వైష్ణవ బజార్ కు చెందిన శేషు మాస్టర్ మాతృమూర్తి ఆదివారం తుదిశ్వాస విడిచారు. అంగన్వాడీ కార్యకర్తగా పని చేసి పదవీ విరమణ పొందిన మరింగంటి ఆండాలమ్మ (70) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 7. 42 గంటలకు తుదిశ్వాస విడిచారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘం నాయకురాలిగా వ్యవహరించిన ఆమె సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారు.