
ఆకివీడు: ఈనెల 25న మహా సంప్రోక్షణ కార్యక్రమం
ఆకివీడు సంత మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కల్యాణ రామాలయంలో ధారు ధ్వజస్తంభ లోహ మయ కవచ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత స్నపన, పూర్వక మండప ఆరాధన కుంభ పూజ, మూల విరాటులకు అభిషేక కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే వాస్తు హోమము, ప్రధాన హోమాలు స్వామి వారి మూల మంత్ర పూర్వక హోమం, మహా పూర్ణాహుతి నిర్వహిస్తున్నామన్నారు