కాళ్ళ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

82చూసినవారు
కాళ్ళ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం రాత్రి కాళ్ళ సామాజిక సంక్షేమ బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల చదువులు, ప్రత్యేక తరగతుల నిర్వహణ, మెడికల్ చెకప్‌లు, మందుల లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చక్కని దిశా నిర్దేశం కల్పించాలంటూ అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్