ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం, పాలకోడేరు గ్రామంలో కునాధరాజు మురళీకృష్ణంరాజు, కృష్ణకుమారి దంపతుల కుమారుడు సాయిరాం ఆధ్వర్యంలో మండల దీక్ష కాలంలో స్వాములు భవానీలు శివ స్వాములు గోవింద స్వాములకు ప్రతిరోజు సుమారు 120 మంది దీక్షాపరులకు ప్రత్యేకంగా ఉచిత బ్రాహ్మణ భోజనం బిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం శ్రీ దుర్గా మణికంఠ దీక్ష పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఆయన్ని ఘనంగా సత్కరించారు.