ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు జరుగుతుందని ఆ సంస్థ రీజనల్ చైర్మన్ గోపి తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉషోదయ స్కూల్ వద్ద నుండి ఉషోదయ విద్యార్థునులచే శాంతి ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని గోపి కోరారు