ఉంగుటూరు: భారీ వర్షాలకు నీట మునిగిన రోడ్డు
ఉంగుటూరు అంబేడ్కర్ స్ట్రీట్ చివరలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ, రోడ్డు నీట మునిగింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల రోడ్డు అంతా ముంపునకు గురికావడంతో ఆ కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ఈ ముంపు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఆ కాలనీ ప్రజలు కోరుతున్నారు.