చిలకలూరిపేట: 10న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
నిరంతరం ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 10న పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామన్నారు. చిలకలూరిపేటలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నాయకులతో సమావేశం నిర్వహించారు. నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.