కేరళ వరద బాధితుల సహాయార్థం నిధి సేకరణ

75చూసినవారు
కేరళలో ఇటీవల కాలంలో సంభవించిన వర్షాలు, వరదల కారణంగా ఊర్లకు ఊర్లు కొట్టుకుపోవటం చాలా బాధాకరమని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అన్నారు. గురువారం గుంటూరు ఏఐటీయూసీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ మానవతా దృక్పడంలో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి రూ. 24, 500 విరాళాలు సేకరించారని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్