గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు ఉద్యోగాల పేరిట మోసం చేశాడని బాధితులు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ బాధితురాలు సబావత్ సుజాత మాట్లాడుతూ.. హైకోర్టు, జిల్లా కోర్టు, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 9 లక్షల చొప్పున పదిమందికి పైగా వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశాడన్నారు. డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.