గుంటూరు జిల్లా ఎస్పీ కీలక సూచనలు
గుంటూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ముగిసే వరకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై అవగాహన కల్పించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. రాజకీయాలకు సంబంధించిన పాటలను ఊరేగింపు సమయంలో పెట్టొద్దని చెప్పారు.