గుంటూరు: ఈ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం తగదు: నవీన్ తల్లి
గతంలో మా అబ్బాయిని గత పాలకులు కారు నడపటానికి తీసుకెళ్లి రౌడీషీటర్ గా మార్చారంటూ తెనాలి యువతి సహాన హత్య కేసులో నిందితుడు నవీన్ తల్లి కుమారి మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఆమె వల్లభాపురంలో ఓ వీడియో విడుదల చేశారు. సహాన కుటుంబం, తాము బంధువులమని, ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నామన్నారు. అంతలోనే ఇలా జరిగిందని, తనకూ బాధగానే ఉందన్నారు. తమ కుటుంబాల మధ్య జరిగిన విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం తగదని అన్నారు.