యోగి వేమన పద్యాలు పలకని తెలుగు వారుండరని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. ఆదివారం యోగి వేమన జయంతి సందర్భంగా సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో యోగివేమన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. యోగివేమన తెలుగు భాషలో భారతీయ తత్వ వేత్త, కవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జి. వి. శివలీల, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.