గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ఈనెల 17వ తేదీ జరిగే స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతరశాఖల అధికారులతో ఎయిమ్స్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.