
చెరుకుపల్లి: తాడిచెట్టు మీద నుండి పడి వ్యక్తి మృతి
చెరుకుపల్లి మండలం ఆళ్లవారి పాలెం గ్రామానికి చెందిన సుంకర నాగరాజు (39) తాడిచెట్టు మీదనుండి పడి శనివారం మృతి చెందాడు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పందిరి కోసం తాటి ఆకులను కోసేందుకు చెట్టుపై ఎక్కగా ప్రమాదవశాత్తు జారీ పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.