
రేపల్లె: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన శివప్రసాద్
అనారోగ్య కారణాలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులకు 3, 98, 669 రూపాయలు చెక్కులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ పంపిణీ చేశారు. బుధవారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో చెక్కులు అందించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో బాధితులకు తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చెక్కులు అందే విధంగా కృషి చేశారని శివప్రసాద్ తెలిపారు.